కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : ప్రతి పండగ మానవజాతికి ఒక సందేశాన్ని ఇస్తుంది అని ఎంఐ ఎం జిల్లా అధ్యక్షుడు మున్నా భాష అన్నారు. ఆ పండుగ సదుద్దేశాన్ని మానవజాతి పాటించే విధంగా ఉంటుందన్నారు. మనిషి పాటిస్తాడా పాటించడా అనేది మనిషి మీద ఆధారపడి ఉంటుందని సంక్రాంతి పండుగ కూడా ఒక మంచి సందేశం ఇవ్వడానికి ఏర్పడిన పండగ అన్నారు. మనిషిలో ఉన్న చెడును భోగిమంటల్లో వేసి దహనం చేసి ప్రేమలు అభిమానాలు ఆత్మీయతలతో మనిషి జీవితం సాగించాలని మన పెద్దలు ఏర్పాటు చేసిన పండగే ఈ సంక్రాంతి పండగ అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Admin
Kalam Power News