కలం పవర్ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : పోలీసు అఫిసర్ కావాలనే ఏడేళ్ల బాలుడి కోరికను బంజారాహిల్స్ పోలీసులు తీర్చారు. ఆ బాలుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని మేక్ ఎ విష్ ఫౌండేషన్ ద్వారా తెలుసుకొని బాలుడిని సంతోషపరిచారు. గుంటూరుకు చెందిన మోహన్ సాయి గతేడాది క్యాన్సర్ బారిన పడ్డాడు. అప్పటి నుంచి హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ చిన్నారికి పోలీసు ఆఫీసర్ కావాలనే కోరిక ఉందని ఆస్పత్రి సిబ్బంది తెలుసుకుని మేక్ ఎ విష్ ఫౌండేషన్ సభ్యులను సంప్రదించి చిన్నారిని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి సిబ్బంది చిన్నారిని సాదరంగా ఆహ్వానించి పోలీస్ అధికారిగా సీట్లో కూర్చోబెట్టారు. బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ చిన్నారికి పోలీసు గౌరవ వందనం చేశారు. మోహన్‌సాయి నుంచి కూడా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో జరిగే పని విధానం గురించి వివరించి బహుమతులను అందజేశారు.
Admin
Kalam Power News