కలం పవర్ న్యూస్ - తెలంగాణ / పాలమూరు : కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా 6 గ్యారంటీలలో ఒక గ్యారెంటీ అయిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ప్రైవేటు వాహనాలలో ప్రజలు ప్రయాణించడం లేదని దాంతో తమకు జీవనోపాధి లేకుండా పోయిందని ఆటో డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో మిడ్జిల్ తహసిల్దార్ రాజు నాయక్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి కోల్పోయిన తమను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకొని ప్రత్యాన్మయం చూపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ సలీం, రాములు, యాదయ్య, నరేందర్, జంగయ్య గౌడ్, నరేష్, రమేష్, శేఖర్ లక్ష్మయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News