కలం పవర్ న్యూస్ - తెలంగాణ / ముసాపెట్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనలో భాగంగా శుక్రవారం నాడు మూసాపేట మండల కేంద్రంలోని నిజాలపూర్ గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్క పేదలకు ప్రజా సంక్షేమ పథకాలను అందజేస్తామని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ నిజాలపూర్ గ్రామాన్ని దత్తత తీసుకొని పూర్తిగా దగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు టిఆర్ఎస్ పార్టీ అనుచరులకే ప్రభుత్వ పథకాలు అందజేశారన్నారు పార్టీలకు అతీతంగా ప్రతి పేద వాళ్లకు సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు, ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బ్రహ్మం గౌడ్. ఎంపీడీవో భాగ్యలక్ష్మి. నయాబ్ తాసిల్దార్ ఆంజనేయులు. ఎంపీ ఓ సరోజా. సర్పంచ్ సత్తెమ్మ. మండల అధ్యక్షుడు శెట్టి చంద్రశేఖర్. గ్రామ అధ్యక్షుడు రామ్ చందర్. ఎంపిటిసి సిజి గోవర్ధన్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Reporter
Kalam Power News