కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గా ఎన్నికైన యేన్నం శ్రీనివాసరెడ్డి సోమ వారం ఏఐఎస్ఎఫ్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో గల ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్ లో నెలకొన్న సమస్యలకు మీ వంతు కృషి చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే విద్యార్థుల సమస్యల పట్ల ఎల్లవేళలా సహకరించడానికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధానంగా గురుకుల పాఠశాలలో సొంత భావనలు లేవని వాటిని మంజూరు చేసే విధంగా కృషి చేయాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ నాయకులు డి. రాము, రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, రమేష్, రాజశేఖర్, జీవిత తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News