కలం పవర్ న్యూస్ - తెలంగాణ / ముసాపెట్ : తెలంగాణ రాష్ట్రంలో గడిల పాలన అంతమైందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. గురు వారం దేవరకద్ర మండలం డోకూర్ గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా గ్రామ సభలో జిల్లా కలెక్టర్ రవి నాయక్, అడిషనల్ కలెక్టర్ శివప్రసాద్లతో కలసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎంఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన అంతమై ప్రజాపాలన ప్రారంభమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని అన్నారు.
Reporter
Kalam Power News